మన అవసరాల కోసం కొన్ని వస్తువులు తెచ్చుకుంటాం . వాటిని సరిగ్గా చూసుకుంటే లైఫ్ లాంగ్ వస్తాయి. నిర్లక్ష్యం చేస్తే తొందరగా పాడవుతాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో కొన్ని పద్ధతులు పాటిస్తే అవి మనకు ఎక్కువ రోజులు ఉపయోగపడుతాయి. ఈరోజుల్లో కంప్యూటర్ తో పనిచేసవాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే కంప్యూటర్లలో లేటెస్ట్ మోడల్స్ వచ్చాయి. ఎక్కువ మంది కన్వినెంట్ కోసం ల్యాప్ టాప్ ను కొనుగోలు చేస్తున్నారు. ల్యాప్ గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల అవి తొందరగా పాడవుతున్నాయి. ప్రధానంగా ల్యాప్ టాప్ బ్యాటరీ గురించి చాలా మంది యూజర్స్ అవస్థలు పడుతారు.
ల్యాప్ టాప్ బ్యాటరీ ఎక్కువ రోజులు సేవ్ కావాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు సాంకేతిక నిపుణఉలు. అలాగే ఆ టిప్స్ పాటించిన వారు కూడా సోషల్ మీడియాలో తమ అనుభవాన్ని తెలుపుతున్నారు. చాలా మంది బ్యాటరీ విషయంలో ఎక్కువగా శ్రమ పడుతారు. బయటికి వెళ్లినప్పుడు ల్యాప్ టాప్ తీసుకెళ్తే అక్కడ బ్యాటరీ అయిపోతే ఛార్జర్ అందుబాటులో ఉండదు. మొబైల్ చార్జింగ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు గానీ.. ల్యాప్ టాప్ చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉండదు. దీంతో కొన్ని టిప్స్ వాడాల్సిందేనంటున్నారు.
ల్యాప్ టాప్ చార్జింగ్ పెట్టి అలాగే వదిలేయకండి. ఫుల్ చార్జింగ్ అయిన తరువాత వెంటనే అడాప్టర్ తీసేయండి. అలాగే ఉంచితే పవర్ సప్లయి అయి బ్యాటరీ డౌన్ అవుతుంది.
ల్యాప్ సీడీ డ్రైవ్లో సీడీ ఉపయోగించిన తరువాత తీసేయండి. అలాగే పెన్ డ్రైవ్ కూడా అవసరం తీరాగా తీసేస్తేనే బెటర్. లేకుంటు అవి రీడవుతూ చార్జింగ్ ఖర్చవుతుంది.
ఛార్జింగ్ 20 శాతం కంటే తక్కువ అయిన తరువాతే మళ్లీ ఛార్జింగ్ పెట్టండి. ఫుల్ చార్జింగ్ ఉండగా అడాప్టర్ పెట్టకండి. దీనివల్ల బ్యాటరీ ఎఫెక్టవుతుంది.
మీ ల్యాప్ టాప్ కు దానితో వచ్చిన ఛార్జర్ ను మాత్రమే ఉపయోగించండ. వేరే అడాప్టర్ పెట్టడం వల్ల కూడా బ్యాటరీ పై ప్రభావం చూపుతుంది.
ల్యాప్ టాప్ కు ఇతర అవసరాల కోసం ఉపయోగించి ప్లగ్ లు వాటి పని అయినపోయిన తరువాత తీసేయండి. లేకుండా ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది.
డిస్ ప్లేను డిమ్ముగా పెట్టుకోండి. ఎక్కువగా పెట్టడం వల్ల ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. అలాగే మీ కళ్లకు కూడా ఎఫెక్ట్ కావచ్చు.