తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో ఉదయ్ కిరణ్ ,తరుణ్ తర్వాత అంతటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు హీరో సిద్ధార్థ్. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో పాటు మరెన్నో ప్రేమ కథ చిత్రాలలో నటించిన ఈయన మంచి లేడీ ఫాన్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ఈయన ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా లవర్ బాయ్ అని గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఈయన లవ్ ఎఫైర్ నడిపిన హీరోయిన్స్ లిస్టు చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇకపోతే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు తెలుగు ఇండస్ట్రీకి దూరమైన సిద్దార్థ్ సహనటుడు శర్వానందుతో కలిసి మహాసముద్రం సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాలో నటించిన అతిథి రావు హైదరితో ప్రస్తుతం సిద్దార్థ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ ముంబైలో ఒక హోటల్ గది నుంచి బయటకు రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు. ఇక బాలీవుడ్ మీడియా కంటపడగా.. నేను ఇక్కడి వాడిని కాదు.. ఫోటో బయటకు వస్తే మర్యాదగా ఉండదంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక దీంతో అతిథి రావు హైదరి – సిద్దార్థ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఇదిలా ఉండగా గతంలో సిద్ధార్థ నడిపిన లవ్ ఎఫైర్ల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
సమంత – సిద్ధార్థ్: సమంత .. నాగచైతన్య కంటే ముందుగా సిద్ధార్థ తోనే ప్రేమాయణం నడిపింది. జబర్దస్త్ సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక తర్వాత సిద్దార్థ్ ప్రవర్తన సరిగా లేక సమంత అతనికి బ్రేకప్ చెప్పి. నాగ చైతన్యతో ప్రేమలో పడి అతడిని వివాహం చేసుకుంది. కానీ అతడితో కూడా విడాకులు తీసుకోవడం గమనార్హం.
శృతిహాసన్: అప్పుడే తన కెరీర్ ను ప్రారంభించిన శృతిహాసన్ కూడా సిద్దార్థ్ తో సహజీవనం చేసింది. ఇక 2011లో వీరిద్దరూ విడిపోయారు.
సోహా అలీ ఖాన్: సిద్దార్థ్ బాలీవుడ్ సినిమా రంగ్ దే బసంతి సినిమాలో నటించాడు. ఇక ఇందులో హీరోగా నటించిన సోహా అలీఖాన్ తో ప్రేమాయణం నడిపించాడు. విషయం తెలుసుకున్న ఈయన మొదటి భార్య ఛీ కొట్టి విడాకులు ఇచ్చింది. ఇక తర్వాత ముంబైలో సోహా అలీఖాన్ ఇంట్లోనే చాలా కాలం ఉన్నాడు. ఇక ఇద్దరి మధ్య గొడవలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు.
దీప సన్నిధి: అప్పట్లో ఈమెతో కూడా ఇతను ప్రేమాయణం నడిపించాడు అని తమిళ్ మీడియా కోడై కోసింది . కానీ ఈ వార్తలలో నిజం లేదని ఆమె ఖండించింది. సిద్ధార్థతో తాను టచ్ లో లేదని బుకాయించింది. ఇంతమందితో ప్రేమాయణం నడిపి బ్రేకప్ చెప్పిన ఇతగాడు కనీసం అతిథి తోనైనా బంధాన్ని కొనసాగిస్తాడో లేదో చూడాలి.