యాంకర్ రష్మీ అంటే అందరికీ సుపరిచితమే. బుల్లితెరపై వస్తున్న జబర్దస్త్ షో ద్వారా రష్మీ చాలా ఫేమస్ అయ్యింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. అదేవిధంగా మూగజీవాలకు ఏమైనా అయితే రష్మీ అస్సలు తట్టుకోలేదు. రష్మీ తెరపై ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది కానీ తెరవెనుక మనకి తెలియకుండా ఆమె ఎన్నో బాధలను అనుభవించిందని లేటెస్ట్ గా రిలీజ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఈ వారం అక్క బావెక్కడ అనే ఎపిసోడ్ తో రాబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ ప్రోమో లో రష్మీ మాట్లాడుతూ.. మీరు నన్ను 9 సంవత్సరాల నుంచి పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు ఇప్పుడు నేను సమాధానం ఇవ్వబోతున్నాను అంటూ తెలిపింది. అలాగే రష్మీ దేవదాసు లాగా మందు బాటిల్ పట్టుకొని యాక్టింగ్ చేసింది. అయితే రష్మీ బయోగ్రఫీ మీద భాను శ్రీ ఒక స్కిట్ చేసింది. ఆ స్కిట్ లో రష్మీ వాళ్ళ అమ్మానాన్నలు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారని ఆ తర్వాత రష్మి అమ్మ దగ్గరే పెరిగిందని తెలుస్తోంది.
నాకు సినిమాలో ఆఫర్ వచ్చిందని రష్మీ తన తల్లికి తెలియజేయగా నీకు మంచేదో చెడేదో తెలుసుకునే జ్ఞానం ఉంది అని రష్మి తల్లి రష్మికి చెప్పినట్లుగా భాను శ్రీ ఆ స్కిట్ చేసి చూపించింది. అలాగే రష్మికి ఒకవేళ షూటింగ్ కు వెళ్లి రావడం ఆలస్యమైతే ఆమె రెంట్ కు ఉండేచోట ఇంటి గేట్ కి నైట్ టైంలో తాళం వేసి ఉండడంతో రష్మీ చాలా ఇబ్బంది పడేదని ఆ రాత్రంతా రష్మీ గేట్ దగ్గరే ఉండాల్సిన పరిస్థితి వచ్చేదని తెలుస్తోంది. అటువంటి ఎన్నో కష్టాలను అనుభవించిన రష్మీ ఇప్పుడు ప్రస్తుతం స్టార్ యాంకర్ లో ఒకరిగా తన కెరియర్ ను ముందుకు సాగిస్తోంది.