ఇండస్ట్రీలో నాగచైతన్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో వరుస సినిమాలు చేసినా ఏ రోజు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోలేదు. కానీ ఇటీవల వరుస విజయాలను అందుకుంటూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ఈయనకు థాంక్యూ సినిమాతో కొంచెం ఇబ్బంది కలిగిందని చెప్పవచ్చు. లవ్ స్టోరీ , బంగార్రాజు సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న ఈయన థాంక్యూ సినిమాతో డిజాస్టర్ మూట కట్టుకోవడం చాలా బాధాకరమని ఆయన అభిమానులు బాధపడుతున్నారు. ఇంకొక వైపు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంతను వివాహం చేసుకొని క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న వీరి జంట గత నాలుగు సంవత్సరాల పాటు ఎంతో సంతోషంగా జీవించి చివరికి విడాకులు తీసుకున్నారు.
ఇక అయితే వీరి గురించి ఇప్పటికీ కూడా ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ప్రతిరోజు వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తాజాగా సమంత బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో కి హాజరయ్యి విడాకుల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఇక విడాకుల తర్వాత ఎలాంటి భరణం తీసుకోలేదని చెప్పిన ఈమె చైతన్యను తనను ఒకే గదిలో ఉంచితే ఆయుధాలు దాచి పెట్టాల్సిందే అంటూ తెలిపింది. ఇకపోతే హోస్ట్ చైతన్యను తన భర్తగా సంబోధించ నుగా వెంటనే అడ్డుపడిన సమంత భర్త కాదు మాజీ బర్త అని పిలవండి అంటూ ఆమె షాకింగ్ కామెంట్ చేసింది.
అలా ఓపెన్ అయిందో లేదో ఇటు నాగచైతన్య కూడా తన జీవితం ఎలా సాగుతుందనే విషయాన్ని తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నాగచైతన్య మాట్లాడుతూ.. ఒక వ్యక్తిగా నేను చాలా మారాను.. గతంలో ఇంత ఓపెన్ గా ఎప్పుడు ఉండేవాడిని కాదు. ఇప్పుడు ఏదైనా మాట్లాడగలుగుతున్నాను. నా కుటుంబం, స్నేహితులతో ఇంకా అనుబంధం పెరిగింది. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది . అంటూ తెలిపాడు నాగ చైతన్య. మొత్తానికి అయితే సమంతను దూరం చేసుకున్న తర్వాత నాగచైతన్య తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని సంతోషంగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది