నాగ చైతన్య అంటే అందరికీ సుపరిచితమే. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన నటించిన తాజా సినిమా థాంక్యూ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎలా గొలా ముగించేశాడు. కానీ ఈయన బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో కలిసి నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా.. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య మరోసారి పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఆయన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇటీవలే థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయనకు ఎదురైన ఓ ప్రశ్న నుంచి ఎప్పుడూ తప్పించుకుంటూ వచ్చాడు చైతూ.
ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఏదో ఒక ఆన్సర్ చెప్పే దాన్ని ఈజీగా దాటవేశాడు. కానీ స్థానిక మీడియా కాబట్టి ఎలాగోలా నాగ చైతన్య మీడియాను మేనేజ్ చేయగలిగాడు.కానీ జాతీయ మీడియా నుంచి తప్పించుకోవడం అంత సులువేమీ కాదు అంటూ చాలామంది నాగచైతన్య గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే నాగచైతన్య దాటవేస్తున్న ఆ ప్రశ్న ఏంటంటే.. గత సంవత్సరం నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో నాగచైతన్యకు హీరోయిన్ శోభితా ధూళిపాళ తో ఎఫైర్ ఉందని సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చాయి.
అయితే వీటి గురించి థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో చాలా మంది మీడియా వాళ్ళు ఈ ప్రశ్నను నాగచైతన్యను అడగగా.. ఆ ప్రశ్నను హీరో దాటవేశాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. థాంక్యూ సినిమా ప్రమోషన్స్ ముగిశాయి కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి. అయితే జాతీయ మీడియా కంట పడకుండా నాగ చైతన్య ఎలా జాగ్రత్త పడతాడో అని చాలామంది భావిస్తున్నారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉండడం అంత ఈజీ కాదు కచ్చితంగా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రశ్న గురించి చైతన్య ఎందుకు నోరు విప్పడం లేదు ఆ హీరోయిన్ తో ఎఫైర్ నిజమేనా అని చాలామంది భావిస్తున్నారు. మరి బాలీవుడ్ మీడియాలో చైతూ ఎలాంటి సమాధానం చెబుతాడో వేచి చూడాలి.