యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బిజీ నటిగా మారిపోయింది. ఓ వైపు సినిమాలు, టీవీ షోల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇద్దరు పిల్లల తల్లయినా కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతున్న అనసూయ ఏం చేసినా సోషల్ మీడియాలో సంచలనమే అవుతోంది. ఆమె దినచర్య కూడా పెద్ద న్యూస్ గా మారుతుంది. తాజాగా అనసూయ హైదరాబాద్ రోడ్లపై విహరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అయ్యాయి.
కరోనా కారణంగా కాస్త రిలాక్స్ అవుతున్న అనసూయ మళ్లీ షూటింగ్స్ రీస్టార్ట్ కావడంతో బిజీగా మారనుంది. ఈ గ్యాప్లో ఈ హాట్ భామ నగరంలోని ఓ బ్యూటీ ఫార్లర్కు వచ్చి సందడి చేసింది. అయితే అనసూయ ప్లేసులో వేరొకరు ఉంటే ఇంత సందడి ఉండేది కాదేమో.. కానీ ఈమె మాత్రం ఓ వైపు ఫ్యామిలీని మెయింటేన్ చేస్తూనే.. మరోవైపు సినీ హీరోయిన్ లా సందడి చేస్తోంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ కుర్రాళ్లకు కిక్ నిస్తోంది.
లెటేస్ట్ గా ఆమె షార్ట్, టీషర్ట్ వేసుకొని కనిపించింది. దీంతో కొందరు ఇదే అదననుకొని ఫొటోస్ తీశారు. ఈ ఫొటోస్ ను నెట్టింట్లో పెట్టడంతో అవి వైరల్ గా మారుతున్నాయి. ఇక అనసూయ లాక్డౌన్లోనూ ఓ వెబ్ సిరీసుల్లో నటించింది. ‘థ్యాంక్యూ బ్రదర్’ అనే సినిమాలో నటించింది. త్వరలో అల్లు అర్జున్ నటించే పుష్ఫ సినిమా షూటింగ్లో పాల్గొననుంది. ఈ మధ్యలో బ్యూటీ ఫార్లర్ కు వెళ్లి తన బ్యూటీనెస్ ను చెక్ చేసుకునేందుకు వెళ్లిందా..? అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.