టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకి తెలిసిన విషయమే. ఇక గతంలో ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తదితర హీరోలు స్వయంకృషితో ఎదిగారు వీరి బాటలోని చిరంజీవి కూడా నడిచారని చెప్పవచ్చు. దీంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు వెనక చాలా పెద్ద కథ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.
తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి నిర్మాత కె ఎస్ రామారావు కలిసి తమ బ్యానర్ లో ఎన్నో చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా అప్పట్లో అగ్ర హీరోలు ఉన్నప్పటికీ చిరంజీవితోనే పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు నిర్మాత కె ఎస్ రామారావు. చిరంజీవి కె ఎస్ రామారావు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ చిత్రం అభిలాష. ఈ చిత్రాన్ని యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన తదుపరిచిత్రం చాలెంజ్.. ఆ తర్వాత మూడవ చిత్రం రాక్షసుడు ఈ సినిమాని కూడా డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే తెరకెక్కించారు. ఇక రాక్షసుడు సినిమా ద్వారానే చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
చిరంజీవి నిర్మాత కేఎస్ రామారావు కలయికలో వచ్చిన నాలుగవ చిత్రం మరణ మృదంగం. ఈ సినిమాని కూడా డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకుంది. ఈ చిత్రంలో మొదటిసారి స్క్రీన్‌పై చిరంజీవి ముందు మెగాస్టార్ అని బిరుదును ఇవ్వడం జరిగింది. నిర్మాత కేఎస్ రామారావు చిరంజీవికి అందించిన ఇదొక గొప్ప బిరుదు అని చెప్పవచ్చు.. అప్పటివరకు చిరంజీవి సుప్రీం హీరో అని బిరుదు పొందారు . కానీ చిరంజీవి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ గా మారడం వెనుక కూడా కారణం ఈ నిర్మాత అన్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ వీరేంద్రనాథ్ దర్శకత్వంలో స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచిపోయింది. దీంతో ఇక చిరంజీవితో సినిమాని తెరకెక్కించలేదు నిర్మాత కేఎస్ రామారావు. దాదాపుగా ఇప్పుడు 31 సంవత్సరాల తర్వాత చిరంజీవి నిర్మాత కె ఎస్ రామారావు కాంబినేషన్లో భోళా శంకర్ సినిమా రాబోతోంది.