క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,హిందీ భాషల్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.
అల్లు అర్జున్ యాక్టింగ్ ఈ సినిమాకి హైలెట్ అయ్యింది. ఇక అందులో వచ్చిన పాటలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది. సమంత చేసిన సాంగ్ సినిమాకి హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో సమంత తన గ్లామర్ తో కుర్రకారు మతులు పోగొట్టింది. అయితే సమంత ఈ ఐటెం సాంగ్ ఎందుకు చేసిందో అసలు కారణాన్ని బయటపెట్టింది. తాజాగా సమంతా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. సమంతతో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
అయితే కరణ్ జోహార్ సమంతను పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ఎందుకు చేశావు అని అడిగితే దానికి గల కారణాన్ని చెప్పుకొచ్చింది. ఆ పాటలోని ట్యూన్ నాకు ఎంతగానో నచ్చిందని, అంతేకాకుండా ఆ పాట మగవారి చూపుల పై సెటైర్ వేసేలా ఉంది. కానీ మగవారిపై వ్యంగ్యస్త్రాలు వచ్చే ఆ పాట చేసినందుకు ఆమె పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ వాటన్నింటినీ పక్కనపెట్టి అందులో నటించానని సమంత క్లారిటీ ఇచ్చింది.