అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చింది హన్సిక. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి పేరు సంపాదించుకుంది. అంతే కాకుండా చాలా మంది స్టార్ హీరోలతో నటించి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. హన్సిక ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయిన ఇంకా సినిమా ఛాన్స్ లు మాత్రం వస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలో తాజాగా హన్సిక నటించిన మహా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హన్సిక మాజీ బాయ్‌ఫ్రెండ్ శింబు కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో హన్సిక నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హన్సిక కొన్ని ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఇదే సమయంలో తనపై వచ్చిన బాడీ షేమింగ్ ట్రోల్స్ పై కూడా స్పందించింది. ఆమె మాట్లాడుతూ..కెరీర్ తొలినాళ్లలో నాపై ఇలా బాడీ షేమింగ్ కామెంట్స్ రావడంతో చాలా ఇబ్బందులు పడ్డాను.
కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టాను. నా బాడి ఎలా ఉండాలనేది నా ఇష్టం. ఇతరులకు నచ్చినట్లు ఉండడంలో ప్రయోజనం ఏమీ లేదని మనకు నచ్చినట్లుగా మనం ఉండడం మంచిదని భావించినట్లు హన్సిక చెప్పుకొచ్చింది. అలాగే ఆమె పై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ పై కూడా పెద్దగా పట్టించుకోనని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హన్సిక 105 మినిట్స్, మై నేమ్ ఈజ్ శృతి వంటి సినిమాల్లో నటిస్తోంది.