మీకు బైక్ అంటే చాలా ఇష్టమా..? అలాంటి బైక్ ఫ్రీగా ఇస్తే ఊరుకుంటారా..? ఎగేసుకొని వెళ్లి తెచ్చుకుంటారు. అంతేకాకుండా జాబ్ తో పాటు బైక్ కూడా ఉచితంగా ఇస్తే..? ఏమాత్రం ఆలోచించరు. ఇలాంటి బంఫర్ ఆఫర్ ప్రకటించింది భారత్ పే కంపెనీ. తన కంపెనీలో చేరే ఉద్యోగులకు బైక్ ఫ్రీగా ఇస్తానని ప్రకటించింది. త్వరలో భారత్లో అడుగుపెడుతున్న ఈ కంపెనీలో చేరితే ఇంకెలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకోండి..
మర్చంట్ అండ్ కన్సూమర్ లెండింగ్ స్పేస్ ప్రొడక్షన్ ను భారత్లో ప్రారంభించడానికి భారత్ పే అనే కంపెనీ రెడీ అయింది. ఇందులో భాగంగా నిపుణులైన టెకీలను తన కంపెనీలో చేర్చుకోవడానికి వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం తమ కంపెనీలో ఉన్న టీమ్ మెంబర్స్ కు తోడుగా మరింత మందిని చేర్చుకోవడానికి 100 మంది ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ఊహించని ఆఫర్లను ఉద్యోగాల్లో చేరేవారి ముందుుంచుంది.
ఈ కంపెనీలో చేరే వారికి బైక్ ప్యాకేజీ లేదా గ్యాడ్జెట్ ప్యాకెజీని సెలక్ట్ చేసుకోవచ్చు. బైక్ ప్యాకేజీలో BMW, G31OR, Jawa Perak, KTM Duke 390, KTM RC 390 బైక్లున్నాయి. ఇక గాడ్జెట్ ఆఫర్లో భాగంగా Apple iPad, Bose Headphone, Harman Kardon, Speaker, Samsung Galaxy Watch ఉన్నాయి. వీటిలో ఉద్యోగులు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చనే ఆప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా తన మొత్తం టీమ్ ను 2021 నవంబర్ 14నుంచి ప్రారంభం కానున్న టీ 20 వరల్డ్ కప్ కోసం దుబాయ్ కి తీసుకెళ్లనుంది. అయితే తమ కంపెనీకి లెటేస్ట్ ఎంప్లాయిస్ అవసరం అని భారత్ ఫే కో ఫౌండర్ , సీఈవో అష్నిర్ గ్రోవర్ తెలిపారు.