హైదరాబాద్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం సూచించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆఫీసులు, వ్యాపారాలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేవారికి పోలీసులు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే వాహనదారులు రోడ్లపైకి రావద్దని చెప్పారు. వర్షం ఆగిన గంట తర్వాత రహదారులపైకి రావాలని సూచించారు.
దీనివల్ల ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా ఉండవచ్చని తెలిపారు. రోడ్లపై నెమ్మదిగా వెళ్లాలని చెప్పారు.కాగా…. భాగ్యనగరంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం పడింది. హైదరాబాద్లోని సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.