Breaking News
Home / Entertainment / ఇంట్లో కూర్చొని నెలకు రూ. 40 నుంచి 80 వేల సంపాదన: తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇంట్లో కూర్చొని నెలకు రూ. 40 నుంచి 80 వేల సంపాదన: తెలిస్తే ఆశ్చర్యపోతారు

కరోనా కారణంగా చాలా మంది ఆఫీసుల్లోకి వెళ్లే వీలు పడకపోవడంతో వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి చాలా కంపెనీలు. ఇప్పటికీ కరోనా ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే సంస్థ ఇంట్లో నుంచి పని చేసేవారికి అడిషనల్ గా ఆదాయం సంపాదించడానికి అవకాశం కల్పించింది. కొద్దిపాటి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి శ్రమపడితే నెలకు 80 వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చని తెలిపింది. IRCTC(Indian Railway Catering and Tourism) తెలిపిన ఈ వివరాలు కింద చూడండి..

IRCTC ఏజెంట్ గా చేరితే ఇంటి నుంచే పని చేసి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఈ సంస్థ ద్వారా ప్రయాణికులకు అవసరమైన సేవలను అందిస్తే కమిషన్ రూపంలో చెల్లిస్తుంది. ఏజెంట్ గా నియామకం అయిన వారు ఎసీ, నాన్ ఏసీ క్లాసులో పిఎన్ ఆర్ టికెట్ బుక్ చేస్తే ప్రతీ టికెట్ మీద కొంత కమీషన్ వస్తుంది. ఎసీ క్లాసులో రూ.40, నాన్ ఏసీ క్లాసులో రూ.20 కమిషన్ గా వస్తుంది. ఇవే కాకుండా రూ.2 వేలకు పైగా ట్రాన్సాక్షన్ జరిపితే ఒక శాతం మొత్తం అకౌంట్లలో పడుతుంది. ఏజెంటు గా నియమాకం అయిన తరువాత ఎన్ని టికెట్లయినా బుక్ చేసుకోవచ్చు. ఇలా టికెట్లు బుక్ చేయడం ద్వారా అధిక ఆదాయం సంపాదించవచ్చు.

IRCTC ఏజెంట్ గా మారాలంటే ఇందుకు సంబంధించిన వెబ్ సైట్లోకి వెళ్లాలి. అక్కడ ఓ ఫాం ను నింపి ఆ తరువాత వారు అడిగిన డిక్లరేషన్ ఫాంపై సంతకం చేసి స్కాన్ చేసి ఇవ్వాలి. వెరిఫికేషన్ తరువాత ప్రత్యేకంగా ఐడీ క్రియేట్ అవుతుంది. ఆ తరువాత నిర్ణీత ఫీజు కట్టి ఏజెంట్ గా నియామకం కావచ్చు. అయితే ఏజెంట్ గా నియామకం కావాలంటే కొంత మొత్తాన్ని చెల్లించాలి. దీనికి రకరకాల ప్లాన్లు ఉన్నాయి. ఒక సంవత్సరం బుకింగ్ ఏజెంట్ గా పనిచేయాలంటే రూ.3,999 చెల్లించాలి. రెండేళ్లకు రూ.6,999 కట్టాలి.

About swathi

Check Also

सुशांत सिंह की मौ,त के ढाई साल बाद परिवार को लगा 1 और झटका, इस प्यारे सदस्य ने छोड़ी दुनिया

फिल्म अभिनेता सुशांत सिंह राजपूत को गुज़र हुए लगभग ढाइ साल हो गए हैं.सुशांत भले …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kaleem Enterprises
ADDRESS: Room No 17, Swastik Apartment, Narhe Road, Ambegaon BK, Pune, Maharashtra 411046 India
CONTACT NO: +9197675 48565
EMAIL: info@hindiguardian.com